విశాఖ ఉక్కను నిలబెట్టుకుందాం..
- విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) త్యాగధనులను మరిచిపోకూడదు
- విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Industry) మన అందరిదనే భావనతో ఉండాలి
- విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుందాం (Let’s save Visakha Steel Plant): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan)
విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కోసం ప్రాణాలను త్యాగం చేసిన త్యాగధనులను మరిచిపోకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Industry) లో పనిచేసే వివిధ స్థాయి ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కోసం 32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితులు, 24 ఎకరాల భూ సేకరణతో ఏర్పాటైందన్నారు. వారు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. పరిశ్రమను కాపాడుకోవడానికి కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియజేసిన ప్రతిపాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలని 12,500ల మంది ఉద్యోగులు, వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని వారికి కొన్ని నెలలుగా అలవెన్సులు కూడా అందడం లేదన్నారు.
పబ్లిక్ సెక్టార్ (Public Sector) యూనిట్స్ బతకాలి…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ పబ్లిక్ సెక్టార్ (Public Sector) యూనిట్స్ బతకాలని కోరుకుంటున్నానని సహకార విధానంలో ఉన్నవి నిలబడాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడామన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) ని కలిసి విశాఖ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలను వివరించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) వద్ద సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్లి వినతిపత్రం ఇవ్వమంటే ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఆ రోజే అందరూ కలిసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సి రాలేదన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Plant) ను నిలబెట్టుకోవడానికి ఉద్యోగులు, కార్మికులు ప్రతిపాదనలు వివరించాలన్నారు. అలాగే మనవైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా తెలుసుకొని సరిదిద్దుకోవాలన్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో జరిగిన చర్చల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత సీఎం విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామని (Visakha Steel Plant Land Sale) మీ ముందు ఉంచిన ప్రతిపాదన నిజమేనా అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.
ముఖ్య ప్రతిపాదనలు (Key Proposals):
విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Plant) కు సొంత గనులు కేటాయించాలి. వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలి.
సెయిల్ (SAIL) లో విలీనం చేయడం.
ఎన్ఎమ్డీసీ (NMDC), నగర్ నార్ స్టీల్స్ (Nagarnar Steel) లో విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Plant) ను విలీనం చేయాలి.
నాన్ స్ట్రాటజిక్ (Non-Strategic Plan) నుంచి స్ట్రాటజిక్ ప్లాన్ (Strategic Plan) పరిధిలోకి విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakha Steel Plant) ను తీసుకోవాలి.
Also Read : పవన్ కళ్యాణ్ కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.
FAQs:
- పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు ఏమి ప్రతిపాదించారు?
పవన్ కళ్యాణ్ పరిశ్రమకు సొంత గనులు కేటాయించి, పరిశ్రమను సెయిల్‌లో విలీనం చేయాలని సూచించారు. - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏమిటి?
పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం కాకుండా పబ్లిక్ సెక్టార్‌లోనే కొనసాగించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. - విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం ఎంతమంది ఉద్యోగులను కలిగి ఉంది?
పరిశ్రమలో 12,500 ఉద్యోగులు మరియు వేలాది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు.