mlc-kavitha-hospital-health-issue: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారిని అనారోగ్య కారణాల వల్ల గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. బీఆర్ఎస్ వర్గాల ప్రకారం, ఆమె వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లినట్లు తెలియజేశారు.
కవిత గారు గతంలో ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. అప్పట్లో చికిత్స పొందిన తర్వాత కొంతకాలం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని సమాచారం. కానీ, తాజాగా ఆమె మరోసారి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.
Also Read : ధర్మవరం టీడీపీ-BJP విభేదాలు: పరిటాల శ్రీరామ్ వివరణ
అత్యవసర వైద్యపరీక్షలు నేడు సాయంత్రానికి పూర్తవుతాయని వైద్యులు తెలిపారు. కవిత గారి ఆరోగ్యం పై మరింత సమాచారం త్వరలో అందే అవకాశం ఉంది.