PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తాPJ NEWS official logo
బ్రేకింగ్ న్యూస్
పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ.. సీఎం చంద్రబాబు ఆదేశాలుఅర్ధరాత్రి హైడ్రా రెస్క్యూ.. యువకుడి ప్రాణాలు కాపాడిన డీఆర్‌ఎఫ్ సిబ్బందిమన్సూరాబాద్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు మాయం!మాదాపూర్ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్ని ప్రమాదం.. కూలింగ్ టవర్ దగ్ధం!ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ డాక్టర్.. పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి రూ.10.05 లక్షల టోకరా!గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు హర్షణీయం: బొబ్బ నవత రెడ్డిపురుగుల బియ్యం.. కుళ్లిన కూరగాయలు.. తెలుగు వర్సిటీలో విద్యార్థుల ధర్నా!పత్తి చేనులో గంజాయి సాగు.. నిర్మల్‌లో రైతు అరెస్ట్!ఆగని రైలు.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. విజయ్ సేతుపతి ‘ట్రైన్’ ట్రైలర్!
తెలంగాణ

అర్ధరాత్రి హైడ్రా రెస్క్యూ.. యువకుడి ప్రాణాలు కాపాడిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది

షేర్ చేయండి:
అర్ధరాత్రి హైడ్రా రెస్క్యూ.. యువకుడి ప్రాణాలు కాపాడిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది
అర్ధరాత్రి హైడ్రా రెస్క్యూ.. యువకుడి ప్రాణాలు కాపాడిన డీఆర్‌ఎఫ్ సిబ్బంది
PJNews | హైదరాబాద్: వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడి ప్రాణాలను హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది, డోమల్‌గూడ పోలీసులు కాపాడారు. గాంధీనగర్‌లో అ…

ప్రాంతం: హైదరాబాద్

PJNews | హైదరాబాద్: వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడి ప్రాణాలను హైడ్రా డీఆర్‌ఎఫ్ సిబ్బంది, డోమల్‌గూడ పోలీసులు కాపాడారు. గాంధీనగర్‌లో అర్ధరాత్రి చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది యువకుడిని సురక్షితంగా రక్షించారు.

అందిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన 28 ఏళ్ల యువకుడు ఏపీ గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన అతడు గాంధీనగర్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో సహాయక బృందాలకు సమాచారం అందించారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

రాత్రి 11.20 గంటలకు సమాచారం అందుకున్న హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్) బృందం పది నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. డీఆర్‌ఎఫ్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ నేతృత్వంలో 15 మంది సిబ్బంది, డోమల్‌గూడ ఎస్సై శ్రీనివాస్ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టారు.

యువకుడికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా రక్షించారు. అనంతరం అతడిని డోమల్‌గూడ పోలీసులకు అప్పగించారు.

సమయస్ఫూర్తితో నిలబెట్టిన ప్రాణం

అర్ధరాత్రి వేళ అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించిన హైడ్రా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో యువకుడి ప్రాణాలను కాపాడగలిగారు. విపత్తుల సమయంలోనే కాకుండా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన సందర్భాల్లోనూ అత్యవసర సహాయక బృందాల సేవలు ఎంత కీలకమో ఈ ఘటన తెలియజేస్తోంది.

వ్యక్తిగత సమస్యలు, మానసిక ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. మానసిక ఆరోగ్య సహాయం కోసం టెలి మానస్ టోల్‌ఫ్రీ నంబర్ 14416ను సంప్రదించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయవచ్చు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి