PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తాPJ NEWS official logo
బ్రేకింగ్ న్యూస్
పత్తి చేనులో గంజాయి సాగు.. నిర్మల్‌లో రైతు అరెస్ట్!ఆగని రైలు.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. విజయ్ సేతుపతి ‘ట్రైన్’ ట్రైలర్!10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనంపారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి.. కార్పొరేటర్లతో సమన్వయం తప్పనిసరిరుషికొండ భవనాలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. 120 రోజులు ప్రజల సందర్శనకు అనుమతిడీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ మద్దతు.. తెలంగాణలో 26 ఎంపీ సీట్లు: కేటీఆర్పుప్పాలగూడలో అర్ధరాత్రి రోడ్డు పనులు.. పట్టాదారుల నిరసనతో ఉద్రిక్తత!డైరెక్ట్ ఫ్లైట్ రద్దు.. 11 గంటల నిరీక్షణకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌పై రూ.70 వేల భారం!గచ్చిబౌలిలో దట్టమైన పొగలు.. డెలాయిట్ భవనం వద్ద కలకలంఖమ్మంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. డైట్ కళాశాల సిబ్బందితో ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్

10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనం

షేర్ చేయండి:
10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనం
10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనం
PJNews | విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లిలో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్…

ప్రాంతం: విజయవాడ

PJNews | విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటుపల్లిలో జరిగిన భారీ బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న పోలాకి అప్పలనాయుడు (47)ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.92 లక్షల విలువైన 654 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.9.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.01 కోట్లకు పైగా విలువైన సొత్తును పోలీసులు రికవరీ చేశారు.

కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా చోరీ

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

నవంబర్ 15న గుంటుపల్లిలో ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భారీ చోరీ జరిగింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లోని బీరువాలో భద్రపరిచిన 764 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బాధితులు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాలతో చిక్కిన నిందితుడు

ఘటనా స్థలంలో కీలక ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలపై దృష్టి సారించారు. విజయవాడ నగరంలోని నిఘా కెమెరాల దృశ్యాలను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలనాయుడు ప్రస్తుతం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కిస్మత్‌పూర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు.

విజయవాడ వన్‌టౌన్ పరిధిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

గతంలో 94 చోరీ కేసులు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అప్పలనాయుడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు చోరీ కేసులు ఉన్నాయి. మొత్తం 94 చోరీ కేసుల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో 2019లో అతడిపై పీడీ చట్టం కింద కూడా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

కేసు దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించి నిందితుడిని పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసు అధికారులు, సిబ్బందిని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు అభినందించారు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి