బోనాల పండుగలో భాగంగా శ్రీ మల్లేష్ మరమల్ల ఆధ్వర్యంలో వివేకానంద నగర్ డివిజన్ దీనబంధు కాలనీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ . ఉత్సవ కమిటీ వారు డప్పులతో, వాయిద్యాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయంకు తీసుకువెళ్లి పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత బండి రమేష్ ను ఘనంగా శాలువలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్లోని పార్టీ నాయకులు మల్లేష్ ,సిల్వర్ మనీష్ , శ్రీనివాస్ ముదిరాజ్, గిరి, శెట్టి , డి కృష్ణ టెంపుల్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ గారితో పాటు పార్టీ నాయకులు గంగారం సంగారెడ్డి, నర్సింగరావు, రవీందర్ రావు, సలీం భాయ్, అంజద్ అమ్ము, మున్ ఆఫ్ ఖాన్, షరీఫ్, సత్తయ్య, ఎండి గౌస్ మరియు బిఆర్ యువసేన తదితరులు పాల్గొన్నారు.