అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని యశస్విని రెడ్డి నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటుకు నోటు కేసులో తాను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లి కారణమన్నారు. తెలంగాణలో టీడీపీ బలహీనపడేందుకు కూడా ఆయనే కారణమన్నారు. ఎర్రబెల్లి వెన్నుపోటు పొడిచే వ్యక్తి, నమ్మకద్రోహి అని ఆరోపించారు. చెన్నూరు రిజర్వాయర్ కోసం  రూ.360 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే దానిని రూ.700 కోట్లకు పెంచి, రూ.350 కోట్లు దోచుకున్న దొంగ ఎర్రబెల్లి అన్నారు.