ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల చివరి నాటికి మరో రెండు మూడు సభలలో పాల్గొంటారని చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా కూడా పలుచోట్ల రోడ్డు షోలో పాల్గొంటారని తెలిపారు. మరో నాలుగైదు స్థానాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు రోడ్డు షోలో పాల్గొంటారన్నారు.
కాగా, ఎన్నికలకు ముందే కొన్ని సర్వే సంస్థలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాలను తప్పుదోవపట్టించడం మంచిది కాదని హెచ్చరించారు.