తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల విరామం తర్వాత ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితిపై మాట్లాడేందుకు తమకు కూడా అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశం ఉంది.