ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా అడ్వాన్స్‌డ్ ఫ్యూచర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. దీంతో ఈ మూవీలో హోలీవడ్ రేంజ్ లో గ్రాఫిక్స్ అండ్ రోబోటిక్ మెషిన్స్ ని చూడబోతున్నాము. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ (Nag Ahwin) దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్.. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ప్రాజెక్ట్ K వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటుంది.ఇప్పటివరకు ప్రీ లుక్ పోస్టర్స్ తోనే ఆడియన్స్ ని సంతోష పరిచిన మేకర్స్.. ఇప్పుడు మూవీ టైటిల్ ని అనౌన్స్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఆదిపురుష్ థియేటర్స్ లోకి వచ్చేసింది. దీంతో తదుపరి వారసులో సలార్ అండ్ ప్రాజెక్ట్ K నే ఉన్నాయి. సలార్ నుంచి టీజర్ రెడీ అవుతుందని వార్తలు వస్తుంటే, ప్రాజెక్ట్ K నుంచి టైటిల్ మోషన్ పోస్టర్ తో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం. జులై మూడో వారంలో అమెరికాలో ఈ మోషన్ పోస్టర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని ప్రభాస్ టీం ట్వీట్ చేసింది.