మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వివిధ జోనర్‌లలో వరుసగా సూపర్ హిట్‌లు కొడుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే మమ్ముట్టి తమిళ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో ఓ చిత్రం చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా బజ్ ప్రకారం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట. సమంత ఈ చిత్రానికి ఓకే చేస్తే మరోసారి సౌత్‌లో బిజీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు గౌతమ్ మీనన్ తో హ్యాట్రిక్ సినిమా అవుతుంది. ఇదివరకు ఆయన దర్శకత్వంలో సమంత ‘ఏమాయ చేశావే’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రాల్లో నటించింది . ఇందులో ఏమాయ చేశావే మూవీ సమంతకు మొదటి చిత్రం కావడం విశేషం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15న చెన్నైలో ప్రారంభం కానుంది. జూన్ 20న మమ్ముట్టి సెట్స్‌లో జాయిన్ అవుతారు. గతంలో మమ్ముట్టి- సమంత కలిసి ఓ యాడ్‌లో నటించారు. మమ్ముట్టి ప్రొడక్షన్ బ్యానర్‌ అయిన ‘మమ్ముట్టి కంపెనీ’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరోవైపు, మమ్ముట్టి ఇటీవల టర్బోతో విజయాన్ని అందుకున్నారు. రీసెంట్ గా ‘భ్రమయుగం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మమ్ముట్టి వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ తన హిట్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ”బజూకా’ కడుగన్నావా ఒరు యాత్ర’, చిత్రాలతో బిజీగా ఉన్నారు . ఇక సమంత విషయానికి వస్తే ‘సిటాడెల్: హనీ బన్నీ’ అనే హాలీవుడ్ టీవీ సిరీస్‌లో నటిస్తుంది. త్వరలోనే ఇది విడుదల కానున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ లీడింగ్ రోల్‌లో నటిస్తున్నాడు.