ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం, పాలేరుకు పెద్ద మొత్తంలో డబ్బులు పంపించి తనను, తుమ్మల నాగేశ్వరరావును ఓడించాలని చూస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. శనివారం నేలకొండపల్లిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… డబ్బు ఒక్కటే ఎన్నికల్లో రాజకీయం చేయదని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతల అహంకారనికి, అధికార మదానికి… కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫుల్‌స్టాప్ పెట్టే సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, మీకు అండగా తాము ఉంటామన్నారు. ముప్పై రోజుల పాటు కష్టపడితే, ఆ తర్వాత మీ కష్టాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు.