బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి చిలకలూరిపేట నియోజకవర్గం బొప్పూడి వద్ద నిర్వహిస్తున్న ప్రజాగళం ఎన్నికల సభకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్నారు. ఈ సభకు బయల్దేరుతూ మోదీ ట్వీట్ చేశారు. 

“ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరాను. ఈ సాయంత్రం పల్నాడులో చంద్రబాబు గారు, పవన్ గారితో కలిసి ఎన్డీయే సభకు హాజరవుతున్నాను. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి, అభివృద్థి దిశగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్ ప్రజల దీవెనలు కోరుతోంది” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.