pawankalyan about telangana ap elections
pawankalyan about telangana ap elections

యాగ దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కొందరు తెలంగాణ జనసేన నేతలు వచ్చి కలిశారు. తెలంగాణలో యాత్రపై క్లారిటీ ఇవ్వాలని.. ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయాలని చెప్పారు. వారితో మాట్లాడిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో తెలంగాణలో జరగనున్నాయని… అదే టైంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు ఉంటాయన్నారు. 

డిసెంబర్‌లోనే ఎన్నికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అందుకున్న తగ్గట్టుగానే సన్నద్దంగా ఉండాలని పార్టీలీడర్లకు సూచించారు. తెలంగాణలో కావాలనుకుంటే పొత్తులతో వెళ్తామని లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. దీనిపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇంతలో జనసేన నాయకులు ప్రజల్లో ఉండి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఏ సిద్ధాం ప్రకారం తెలంగాణ వచ్చిందో అది ఎంత వరకు నెరవేరింది… యువత ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసే క్రమంలో ఇంటిగ్రిటీని పోగొట్టుకోవద్దని జనసేన నేతలకు పవన్ సూచించారు. ఒంటరిగా పోటీ చేసిన తక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని వాటిపైనే ఫోకస్డ్‌గా పని చేస్తామన్నారు. నేతలు మాత్రం నిత్యం ప్రజల్లో ఉండి సమస్యలు తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో వారాహి యాత్ర ఉంటుందో లేదో అన్న అంశంపై కూడా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.వారాహి ఎక్కడ మొదలైందో అక్కడే ముగించే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో యాత్ర ఉంటుందని చెప్పగానే నేతలంతా హర్షం వ్యక్తం చేశారు. చప్పట్లు కొట్టి ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఓ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ… డిసెంబర్‌లో ఎన్నికలు జరిగితే తాను జూన్ నుంచి ప్రజల్లో ఉంటానని యాత్ర చేపడతానంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన యాత్ర చేస్తున్నారు.