జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఆయనకు జనసేన పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా గ్రౌండ్స్ లో జనసేన పార్టీ భారీ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీశ్ కుమార్ ఈ సభలో పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ సభకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు, విశాఖ నగరం, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నేతలు కూడా హాజరవుతారు.