దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయి (50)ని వైసీపీకి చెందిన ఒక సైకో ట్రాక్టర్ తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. 

వారం రోజులుగా గుక్కెడు నీరు దొరకని పరిస్థితుల్లో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను… మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టుకోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించాడని మండిపడ్డారు. తాగునీటికి, పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమని అన్నారు.