యూకేలో నా మూడు రోజుల పర్యటనను విజయవంతం చేసిన ఎన్.ఆర్.ఐ. జనసేన విభాగం సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ హారోలో జరిగిన జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ సమావేశానికి జనసేన శ్రేణుల మొత్తాన్ని సమావేశపరిచి, ఎలాంటి లోటు పాట్లు లేకుండా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి విజయవంతం చేసిన కోర్ టీమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు చూపించిన ఆదరణ, అభిమానాలు జీవితకాలం గుర్తుండి పోతాయి. జనసేన పార్టీ అభ్యున్నతి కోసం, భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణ కోసం మీ అందరితో జరిపిన చర్చలు, సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో సాగాయి. పార్టీ ఉన్నతికి కచ్చితంగా జనసేన ఎన్నారై విభాగం సేవలు ఎనలేనివి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ఖండాంతరాలు దాటి ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్క ఎన్నారై కృషి అమోఘమని చెప్పాలి. భవిష్యత్తులోనూ పార్టీ మరింత ముందుకు వెళ్లడానికి, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి ప్రతి ఒక్క ప్రవాస భారతీయుడి సేవలు జనసేన పార్టీకి ఎంతో అవసరం అని నేను భావిస్తున్నాను. దీనికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా
ఎన్ఆర్ఐ జనసేన యూకే విభాగం కోర్ టీమ్ సభ్యులు
శ్రీ నాగేంద్ర సోలంకల,
శ్రీ శంకర్ సిద్దం,
శ్రీ చంద్రశేఖర్ సిద్దం,
శ్రీ నాగరాజు వడ్రాణం,
శ్రీ శివ కుమార్ మేకా,
శ్రీ బాల సుబ్రహ్మణ్యం నల్లి,
శ్రీమతి అమలా చలమలశెట్టి,
శ్రీమతి పద్మజా రామిశెట్టి,
శ్రీ అరుణ్ గంటా,
శ్రీ శివ గంటా,
శ్రీ అశోక్ మాజేటి,
శ్రీ కమల్ మణికొండ,
శ్రీ ప్రసన్న వి చిక్కుడుకాయల,
శ్రీ శ్రీనివాస్ పల్లి,
శ్రీ కళ్యాణ్ వడ్డి,
శ్రీ జోజిబాబు గుబిలి,
శ్రీ రామకృష్ణ తిరుమలశెట్టి,
శ్రీ రాజాజీ టిక్కిరెడ్డి,
శ్రీ శ్రీనివాసరావు రంకిరెడ్డి,
శ్రీ విజయ్ తిరుమలశెట్టి,
శ్రీమతి హిమవల్లి నాయుడు,
శ్రీ భానుప్రకాష్,
శ్రీ వీరబాబు పడాల లకు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని శ్రీ నాగబాబు అన్నారు.