జనసేన పార్టీ తరఫున ఇంతవరకు ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పష్టం చేశారు. అలాంటి ఫేక్ వార్తలు వ్యాప్తి చేయొద్దని ఆయన కోరారు. ఒకవేళ అలాంటి నియామకం ఏదైనా ఉంటే జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి, పవన్ ధ్రువీకరణతో పోస్టు చేస్తామని స్పష్టం చేశారు. అంతవరకు ఎవరూ ఫేక్ వార్తలతో కూడిన అవాస్తవ పోస్ట్ లను ప్రచురించవద్దని, ప్రచారం చేయవద్దని నాగబాబు పేర్కొన్నారు. అలాంటి ఫేక్ వార్తలతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించవద్దని మనవి అంటూ ట్వీట్ చేశారు.