మ‌రో రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంక‌ట్రామిరెడ్డిని బ‌రిలో దించుతున్న‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు. భువ‌న‌గిరి, న‌ల్ల‌గొండ‌, సికింద్రాబాద్, హైద‌రాబాద్, చేవెళ్ల‌ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. త్వ‌ర‌లోనే ఈ నాలుగు స్థానాల‌కు కూడా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, క‌రీంన‌గ‌ర్ నుంచి వినోద్ కుమార్, పెద్ద‌ప‌ల్లి నుంచి కొప్పుల ఈశ్వ‌ర్, జ‌హీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, ఖ‌మ్మం నుంచి నామా నాగేశ్వ‌ర్ రావు, మ‌హ‌బూబాబాద్ నుంచి మాలోత్ క‌విత‌, మ‌ల్కాజ్‌గిరి నుంచి రాగిడి ల‌క్ష్మారెడ్డి, ఆదిలాబాద్ నుంచి ఆత్రం స‌క్కు, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, వ‌రంగ‌ల్ నుంచి క‌డియం కావ్య‌ పోటీ చేయ‌నున్నారు.