ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో భేటీ అయ్యారు. బీజేపీ నేతలు అమిత్ షా, జేపీ నడ్డా ,నితిన్ గడ్కరీ , రాజ్ నాథ్ సింగ్ , పాల్గొన్నారు . మోడీని మరోసారి ప్రధాని అభ్యర్థిగా టీడీపీ , జేడీయూ , ఎన్డీయే పక్షాలు బలపరిచాయి. జూన్ 4 న వెలువడ్డ పలితాలతో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 292 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్బంగా ఎన్డీయే కూటమితో భాగస్వాములుగా ఉన్న పార్టీ అధినేతలు మోడీతో సమావేశమయ్యారు. కూటమిలో అతి పెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ , జేడీయూ అధినేతలు చంద్రబాబు , నితీష్ కుమార్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అందరూ మోదీని ప్రధానిగా బలపరచటంతో ఈ నెల 8న మరోసారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. అయితే కేంద్రంలో తెలుగు రాష్ట్రాల నుండి ఎవరికీ కేంద్రమంత్రులుగా అవకాశషం దక్కుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో టీడీపీ , జనసేనకు అవకాశం దక్కనుంది. ఇక తెలంగాణా నుండి ఇద్దరి బీజేపీ నేతలకు ఛాన్స్ ఉందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మూడవసారి ఏర్పడుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో టీడీపీ ముఖ్య పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగా చంద్రబాబు కేంద్రంలో ఇద్దరికీ పైగా మంత్రులతో పాటు స్పీకర్ పోస్ట్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది