జనగామ టిక్కెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఆయన మంగళవారం జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పల్లా రాజేశ్వర్ రెడ్డికే టిక్కెట్ కేటాయించామని, ఆయనను గెలిపించాలని నేతలకు సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు.జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డికి కేసీఆర్ టిక్కెట్ నిరాకరించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముత్తిరెడ్డి అలక వహించారు. ఇరువురు నేతలు పోటాపోటీగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ ఇరువురు నేతలు, నాయకులతో కలిసి పార్టీని గెలిపించాలని సూచించారు.