వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. తన పార్టీని ఆమె కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… దేశంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాహుల్ ను షర్మిలో, మరెవరో ప్రధానిని చేయలేరని… సామాన్య ప్రజలు అనుకుంటేనే అది జరుగుతుందని చెప్పారు. ప్రధాని ఎవరనేది సామాన్య ప్రజలు డిసైడ్ చేస్తారని అన్నారు. రాహుల్ గాంధీ ఫార్ములా, మెడిసిన్ ఫెయిల్ అయ్యాయని చెప్పారు.