తెలంగాణ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మహాలక్ష్మి, చేయూత పథకాలను ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమయింది. రాష్ట్ర సరిహద్దుల వరకు మహిళలు, బాలికలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మరోవైపు ఆరోగ్యశ్రీ పథకం పరిధిని కూడా ప్రభుత్వం రూ. 10 లక్షలకు పెంచింది. బాక్సర్ నిఖత్ జరీన్ కు రూ. 2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందించారు.