ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు,జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళలకు తమిళనాడు ప్రభుత్వం ప్రతినెల అందిస్తున్న రూ. 1000 ముష్టిగా అభివర్ణించారు. రూ. 2 వేల కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత జాఫర్ సిద్ధిఖీ అరెస్ట్ కావడం, రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు వరుసగా బయటపడుతుండడంపై  ఖుష్బూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం ముష్టి వేస్తున్నట్టు రూ. 1000 ఇస్తున్నప్పటికీ మహిళలు ఆ పార్టీకి ఓటు వెయ్యొద్దని కోరారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి, టాస్మాక్‌ (మద్యం దుకాణాలు)ను మూసివేయిస్తే అప్పుడు ఈ రూ. 1000 భిక్ష వేయాల్సిన పని ఉండదని అన్నారు.