ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మాజీ మంత్రి కడియం శ్రీహరి బీఫామ్ అందుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బదులుగా కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రగతి భవన్ కు వెళ్లిన శ్రీహరి బీఫామ్ ను తీసుకున్నారు. మరోవైపు, కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు తెలుపుతున్నానని రాజయ్య తెలిపారు. శ్రీహరి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ లో గులాబీ జెండా ఎగుర వేస్తామని కేటీఆర్ కు ఆయన మాట కూడా ఇచ్చారు. మరోవైపు రాజయ్యకు టికెట్ ఇవ్వని నేపథ్యంలో… ఆయనను రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు.