ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ అగ్ర నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో భేటీ అయిన పవన్.. ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితుల అంశాన్ని నడ్డా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనను పవన్ కల్యాణ్ కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా నడ్డా తెలియజేశారు. వీరి భేటీలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు

https://twitter.com/JPNadda/status/1681909304440524800/photo/1