హైదరాబాద్‌ శివారులో శుక్రవారం భారీగా డ్రగ్స్‌ ను పోలీసులు పట్టుకున్నారు.
దాదాపు 9కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు. ఇంటర్‌పోల్‌ సాయంతో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేసి, డ్రగ్స్ తయారు చేస్తు న్న కస్తూరిరెడ్డి నల్ల పొడిని అరెస్ట్ చేశారు.
ఐడీఏ బొల్లారంలోని ఓ ఫ్యాక్టరీలో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు ఇంటర్‌పోల్‌ సమాచారం ఇచ్చింది. రంగంలోకి డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు.. మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు నిర్వహించారు.

నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్‌ డ్రగ్‌ను సీజ్‌ చేశారు. గత పదేళ్లుగా డ్రగ్స్‌ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
తయారైన డ్రగ్‌ను సిగరెట్‌ ప్యాకెట్లలో పెట్టి విదేశాలకు తరలిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు.