తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే జగన్ 1000 తప్పులు చేశాడని మండిపడ్డారు. జగన్ విశ్వసనీయత పెద్ద ఫార్స్ అని విమర్శించారు. హోదా తెచ్చాడా, సీపీఎస్ రద్దు చేశాడా, మద్యపాన నిషేధం చేశాడా… ఏం చేశాడని విశ్వసనీయత గురించి చెప్పుకుంటున్నాడు? అని నిలదీశారు. ఎర్రచందనం స్మగ్లర్ లకు అసెంబ్లీ టిక్కెట్లా? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. 

నేడు అన్నీ పోయాయి!

చెన్నైతో తిరుపతి, నెల్లూరుని లింక్ చేసి హబ్ గా చేయాలనుకున్నాం. వీటిని కనెక్ట్ చేస్తూ రోడ్లని వేశాం. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా చేశాం. సెల్ కాన్, కార్బన్, డెక్కన్ వంటి అనేక కంపెనీలు తిరుపతికి తెచ్చాం. అక్కడ కంపెనీల్లో పని చేయించుకునేందుకు వెంకటగిరి నుంచి యువతను బస్సులో తీసుకువెళ్లుతున్నారు. హీరో మోటార్స్, అపోలో టైర్లు, రిపబ్లిక్ ఫోర్స్ తో శ్రీ సిటీలో పెట్టి యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలోనే మంచి సంస్థలను తీసుకువచ్చాం. కాని నేడు అన్నీ పోయాయి.