‘‘ఆటపట్టించడం (టీజ్) అయిపోయింది.. ఎంతో మంది ఎదురుచూసిన టీజర్ అప్‌డేట్‌ త్వరలోనే వస్తోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. పవన్, సాయి ధరమ్ తేజ్‌లపై పోస్టర్ ని రిలీజ్ చేసింది.తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ పాట లుక్‌లో పవన్ పోజు అదిరిపోయింది. ఎర్ర షర్ట్, లుంగీలో పవన్.. ప్యాంట్‌పైనే లుంగీతో సాయి ధరమ్ కనిపించారు. మరోవైపు సాయి ధరమ్ కూడా ఈ పోస్టర్‌‌ను ట్వీట్ చేశారు. త్వరలోనే టీజర్‌‌ విడుదల కానుందని చెప్పారు.సినిమాను జులై 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.