బీజేపీ సభకు వచ్చిన జనాన్ని చూసి సీఎం కేసీఆర్ గుండె పగిలిపోవడం ఖాయమని… బీజేపీ బంపర్ మెజార్టీతో గెలవడం తథ్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మనలో హిందూ రక్తం ప్రవహిస్తే.. ఛత్రపతి శివాజీ వారసులమైతే.. నవంబర్ 3న ముథోల్‌లో విజయోత్సవాలు జరపవలసిందే అన్నారు. బండి సంజయ్ ఈ రోజు భైంసాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పార్టీ అభ్యర్థి రామారావు పటేల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముథోల్‌ను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. భైంసా – నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. జాతీయ రహదారిని మహోర్ వరకు పొడిగించాలనే ప్రజల డిమాండును కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.