బాపట్ల జిల్లా చీరాల రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు ప్రకాశం జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు , తన తమ్ముడిని ముందు నిలబెట్టి 2014 లో తన రాజకీయ చాణుక్యతతో ఇండిపెండెంట్ గా తన తమ్ముడిని గెలిపించిన వ్యక్తి తన తమ్ముడి రాజకీయ విషయంలో కొన్ని రాజకీయ అసమ్మతుల వలన దూరం పెరిగిన మాట వాస్తవం రాజకీయ లబ్దిని ఆశిస్తున్నా ఆమంచి కృష్ణమోహన్ అనే తన తమ్ముడినో నేడు వ్యతిరేస్తూ పవన్ కళ్యాణ్ లాంటి నిజమైన నాయకుడితో తన ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించి జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ మొదలైంది.పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని నాగబాబు గారిని కలవడం ఒక సుభపరిణామనే చెప్పచ్చు .ఈ నెల 12 జనసేనలో చేరుతారని ఊహాగానాలు మొదలయ్యాయి

