ali pawan kalyan

సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌న్నిహితంగా ఉంటూ వ‌చ్చిన వారిలో సీనియ‌ర్ క‌మెడియ‌న్ అలీ ఒక‌రు. ఈ విష‌యాన్ని అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా త‌న ప్ర‌తీ సినిమాలో అలీ ఉండ‌టం అనేది సెంటిమెంట్‌గా మారింద‌ని చెప్పుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌ర్వాత ప‌రిస్థితుల కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీని పెట్టారు. అయితే ఆయ‌న స్నేహితుడు అలీ మాత్రం వైసీపీలో జాయిన్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏపీ ఎల‌క్ట్రానికి మీడియా స‌ల‌హాదారుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అయితే గ‌త‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో ఎందుకు చేర‌లేద‌ని ప్ర‌శ్నించిన సంద‌ర్భంలో ప‌వ‌న్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. అది జ‌న సైనికుల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. దానికి త‌గ్గ‌ట్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం అప్ప‌టి నుంచి త‌న సినిమాల్లో అలీకి చాన్స్ ఇవ్వ‌లేదు. అలాగ‌ని ఇద్ద‌రూ ఏమైనా దూరంగా ఉంటున్నారా! అంటే అదేమీ లేదు. అలీ త‌న కుమార్తె పెళ్లికి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ప్ర‌త్యేకంగా క‌లిసి ఆహ్వానం అందించారు. ఆ పెళ్లికి కొన్ని కార‌ణాల‌తో ప‌వ‌న్ వెళ్ల‌లేద‌నుకోండి. కానీ.. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్‌తో అలీ బేటీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.కానీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. వ‌రుస సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ మాత్రం అలీతో క‌లిసి న‌టించ‌టం లేదు. అయితే దీనికి కూడా ఇప్పుడు బ్రేక్ ప‌డ‌నుంది. ఎందుకంటే సినీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు OG మూవీలో అలీ న‌టించ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయ‌బోయే కొత్త షెడ్యూల్లో ప‌వ‌న్‌, అలీ మ‌ధ్య స‌న్నివేశాలుంటాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఈ వార్త‌లపై మేక‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.