69వ రోజు గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర

శేరిలింగంపల్లి మియాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ గడపగడపకు బిజెపిని నినాదంతో గురువారం రోజు మియాపూర్ డివిజన్ కృష్ణ సాయి ఎంక్లేవ్, లక్ష్మీ వెంకట హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమార్ యాదవ్ బిజెపి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలనుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలియజేశారు. పాదయాత్ర ద్వారా అనేకమంది భారతీయ జనతా పార్టీలో కలుస్తున్నారని ప్రజా సమస్యలు తీర్చడంలో భారతీయ జనతా పార్టీ ముందు వరుసలో ఉంటుందని తెలుపుతూ పాదయాత్రలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలియజేశారు. ఈ కాలనీలలో ప్రధానంగా డ్రైనేజీ, సీసీ రోడ్స్, మంజీరా నీటి సమస్య ఉందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే సమస్యలన్నీ త్వరితగదన పరిష్కరిస్తామని కాలనీ వాసులకు రవి కమార్ యాదవ్ హామీ ఇచ్చారు.

Previous article6-7-2023
Next article07-07-2023