శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు ఫిర్యాదు చేశారని తిరుపతి ఎస్పీ సోమవారం తెలిపారు. జనసేన పార్టీ నాయకుడిపై చేయి చేసుకున్న అంశానికి సంబంధించిన ఘటనపై విచారణ కమిటీ వేశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి నివేదికను ఇప్పటికే డీజీపీకి పంపించినట్లు చెప్పారు. విచారణ కమిటీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సీఐ అంజుయాదవ్ పై జనసేనాని ఈ రోజు ఉదయం తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అంజుయాదవ్ తీరుపై తాను ఎస్పీకి ఫిర్యాదు చేశానని పోలీసు అధికారిని కలిసిన అనంతరం పవన్ కల్యాణ్ చెప్పారు. శాంతియుత నిరసనలు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పార్టీ నాయకులను సీఐ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుందనే విషయం తెలుసునని, కానీ అది ఓ స్థాయి వరకు మాత్రమే ఉంటుందని అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు శాంతిభద్రతలు, హక్కులను కాపాడాలని హితవు పలికారు.

Previous article17-7-2023 TODAY E-PAPER
Next article‘జవాన్’ నుంచి నయనతార యాక్షన్ లుక్…