శేరిలింగంపల్లి మియాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, ఓంకార్ నగర్ లలో గత 40 సంవత్సరాల నుండి దాదాపు 2000 కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెనుకబడిన వర్గాల పేద ప్రజలు పదివేల జనాభా స్థిర నివాసాలు ఏర్పరచుకొని నివాసం ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామ పరిధిలోని బస్తీలలో ఉన్న పేద ప్రజల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని, అలాగే మౌలిక వసతులు లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక, త్రాగు నీరు మరియు అనేక సమస్యలతో సతమతమౌతున్న ప్రజల సమస్యలను తాను బస్తీవాసులతో కలిసి అనేక మార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినా కూడా, స్థానిక ప్రభుత్వ అధికారులు నేటి వరకు పట్టించుకోవడం లేదని ఈ సందర్బంగా యోగానంద్ ఆవేదన వ్యక్తం చేసారు.
వివరాలను తెలియపరుస్తూ, సర్వే నెం28 లో ఉన్న ఈ భూములు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ భూసంస్కరణల చట్టం ప్రకారం ప్రభుత్వ అధీనం లోకి వచ్చాయని, ఆ తదుపరి సo||1981 హెచ్ఎండిఏ కి ఈ భూములను అప్పగించినప్పటి నుండి వారి అధీనంలో ఈ భూములు ఉన్నాయన్నారు.
నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చేసిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో వారు సo|| 2021 లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి నివేదిక ఇవ్వవలసినదిగా ఆదేశించడమైనది. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి ఆధార్ కార్డులు, కరెంటు కనెక్షన్, వాటర్ కనెక్షన్ వున్నా కూడ సి ఆర్ పి ఎఫ్ కు తగు సమాచారం ఇవ్వలేదని, రెవిన్యూ అధికారులు సo|| 2016 లో సి ఆర్ పి ఎఫ్ కు వివరాలు ఇచ్చే ముందు పేదలు నివసిస్తున్న బస్తిలను మినహాయించడంలో అధికారులు విఫలం అయ్యారని, ప్రజలు CRPF సిబ్బంది వారు అనేక రకాల,చెప్పుకోలేని ఇబ్బందులకు గురి చేస్తున్నారని యోగానంద్ ఆవేదన వ్యక్తం చేసారు. రెవిన్యూ అధికారులు సర్వే చేసి, సర్వే నంబర్ 28 లో 384 ఎకరాల భూముల నుండి 132 ఎకరాలు హెచ్ఎండిఏ కు కేటాయించినట్టుగా, వారు దానిలో 104 ఎకరాల మెట్రో రైల్ కార్పొరేషన్ కు మరియు ప్రైవేట్ వ్యక్తులకు వేలం వేశారని , ఎంత మంది పేద ప్రజలు నివసిస్తున్నారని తెలుపకపోవడం, సరైన పంచనామా చేయకపోవడం విచారకరం అని అని తెలుపుతూ. పేద ప్రజలు లంచాలు ఇవ్వలేరని వారి పక్షంలో అడిగే నాధుడు లేదని అనుకోవడం స్థానిక ప్రభుత్వం, రాజాకీయ నాయకులు చేసిన పొరపాటుకి మూల్యం చెల్లించుకోక తప్పదని యోగానంద్ హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా గతంలో నిర్మించుకున్న పాత ఇండ్లు కూలిపోవడం, తిరిగి నిర్మాణం చేసుకొనుటకు నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ను లోపలికి రానివ్వకుండా అడ్డుకొని సీఆర్పీఎఫ్ బెటాలియన్ వాళ్లు కూల్చివేయడం జరిగిందని రాత్రి వేళలో కురిసిన వర్షానికి ఇండ్లలో నీరు చేరి ఇండ్లు కూలిపోయి రాత్రి సమయంలో నిద్ర హారాలు మాని పేద ప్రజలు బాధపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని యోగానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటి పరిష్కారంగా నడ్డిగడ్డ తండా, సుభాష్ చంద్ర బోస్ నగర్, మరియు ఓంకార్ నగర్ లో గల 28 సర్వే నెంబర్ లో నివాసం ఉంటున్న పేద ప్రజల ఇంటి స్థలాలకు పక్కా పట్టాలు ఇవ్వాలని, వర్షపు నీరు నివాసితులు ఇళ్ల లోకి పోకుండా శానిటరీ మరియు డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు చర్యలు వెంటనే ప్రారంభించాలని, పిల్లల కోసం ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలగు ప్రజల అవసరాలకు ఉపయోగపడే వ్యవస్థలను ఏర్పాటు చేయాలనీ యోగానంద్ డిమాండ్ చేసారు. ఈ పోరాటంలో న్యాయపరంగా పోరాటం చేసే వ్యక్తులకు, నాయకులకు తన సహాయ సహకారాలు ఇవ్వడం జరిగిందని 05-07-2023 నాడు సర్వే నంబర్ 28 లోని పేద ప్రజలు వేసుకున్న ఇండ్లకు చేసిన న్యాయ పోరాటం, ప్రజావ్యాజ్యానికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయడం పట్ల యోగానంద్ హర్షం వ్యక్తం చేసారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. యోగానంద్ మాట్లాడుతూ. ఈ ప్రాంత నివాసితుల సమస్యలపై వేసిన ప్రజావాజ్యంపై గౌరవ హై కోర్ట్ వారు ఇక్కడ నివసిస్తున్న 2 వేల కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించరాదని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జస్టిస్ ఎన్.తుకారాం జి, ఉజ్జల్ భూయాన్ గార్లకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చి రెడ్డి, ఎస్. రమేష్, మానిక్, నాయిని రత్న కుమార్, రమేష్ సోమిశెట్టి, బాషా శివ, స్థానికులు పాండు, మోహన్, కృష్ణ, సందీప్, రాజు, రవీందర్, ఎం. గణేష్, ఎస్ శ్రీను తదితరులు పాల్గొని ప్రజావాజ్యం పిటిషన్ దాఖలు చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన యోగానంద్ కి ధన్యవాదాలు తెలిపారు.