దాదాపు రూ. 1 కోటి వరకు సంపాదించిన యూట్యూబర్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఉన్న యూట్యూబర్ తస్లీమ్ ఇంటిపై జరిపిన దాడిలో రూ. 24 లక్షలను అధికారులు గుర్తించారు. కొన్నేళ్లుగా తస్లీమ్ యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నాడు. అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మరోవైపు ఆయన సోదరుడు ఫిరోజ్ మాట్లాడుతూ, తస్లీమ్ ఎలాంటి తప్పులు చేయలేదని అన్నాడు. తన యూట్యూబ్ అకౌంట్ ‘ట్రేడింగ్ హబ్ 3.0’ ద్వారా షేర్ మార్కెట్ సంబంధిత వీడియోలు పోస్ట్ చేస్తుంటాడని… సంపాదనపై వచ్చే ఆదాయానికి ట్యాక్స్ కూడా కడుతున్నాడని చెప్పారు. యూట్యూబ్ ద్వారా వచ్చిన రూ. 1.2 కోట్ల ఆదాయానికి ఇప్పటికే రూ. 4 లక్షల పన్ను కట్టామని తెలిపాడు. తాము ఎలాంటి తప్పు చేయలేదని… ఒక కుట్ర ప్రకారమే ఐటీ దాడులు జరిగినట్టు అనిపిస్తోందని చెప్పాడు.