సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., చేతుల మీదుగా చెక్కు కుటుంబ సభ్యులకు అందజేతతేదీ 21-06-2023 రోజున అనారోగ్యంతో చనిపోయిన పి. అశోక్ వర్ధన్, హెడ్ కానిస్టేబుల్, RGIA ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ కుటుంబానికి తోటి 2000 బ్యాచ్ హెడ్ కానిస్టేబుల్లు ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా బ్యాచ్ (సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్) తమ వంతుగా రూ. (2,45,525/-) సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., గారి సమక్షములో వారి కుటుంబానికి అందచేయడం జరిగినది. వీరి కుటుంబానికి త్వరగా బెనిఫిట్స్ త్వరగా వచ్చేవిదంగా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులకు చెప్పారు. కుటుంబసభ్యులకు మేమున్నామని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో అశోక్ వర్ధన్ బార్య చంద్రకళ, పిల్లలు సుజన్, సంజన, తోటి బ్యాచ్ మేట్స్ శ్రీనివాస్, సత్తయ్య, వెంకటేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సి. హెచ్. భద్రా రెడ్డి, కోశాధికారి జి. మల్లేశం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. కరుణాకర్ రెడ్డి, జి. క్రిష్ణారెడ్డి తదితరులు&nbsp పాల్గొన్నారు.