శేరిలింగంపల్లి కొండాపూర్ పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; గురువారం రోజు సంద‌య్య మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ సహకారంతో శేరిలింగంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్ష‌ప‌తి యాద‌వ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి కుమార్ యాద‌వ్ ఆధ్వర్యంలో లింగంప‌ల్లి లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థిని, విద్యార్దుల‌కు ఉచిత నోటు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి మాట్లాడుతూ. స‌మాజ సేవ చేయ‌డానికి యువ‌త రాజకీయాల్లోకి రావాల‌ని సూచించారు. ఉచితంగా నోటు బుక్‌లు పంపిణీ చేస్తూ విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కొర‌కు స‌హ‌క‌రిస్తున్న ర‌వికుమార్ యాద‌వ్‌ను అభినందించారు. శేరిలింగంప‌ల్లికి ప్రజలకు బిక్ష‌ప‌తి యాద‌వ్ లాంటి మంచి నేత‌ను అందించిన ఘ‌న‌త లింగంప‌ల్లి పాఠ‌శాల‌కు ద‌క్కింద‌న్నారు. సంద‌య్య ట్ర‌స్ట్ ద్వారా పేద వారికి ఉచిత విద్య‌, వైద్యానికి సాయం చేశార‌ని తెలిపారు. టీచ‌ర్లు కోపంతో చెప్పినా బుజ్జ‌గించి చెప్పిన విద్యార్థుల మంచికోస‌మే అన్నారు. ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు క‌నీస సౌక‌ర్యాలైన మరుగుదొడ్లు శుభ్రత ను పట్టించుకోవట్లేదు, నేను, రవికుమార్ యాదవ్ ఇద్దరం కలిసి ఆ బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది, తదనంతరం మాజీ ఎమ్మెల్యే ఎం. బిక్ష‌ప‌తి యాద‌వ్ మాట్లాడుతూ. పాఠ‌శాల‌ల్లో అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తేనే విద్య స‌జావుగా సాగుతుంది, క‌నీస వ‌స‌తులు లేకుండా విద్యార్ధులు ఎలా చ‌దువుతార‌ని ప్ర‌శ్నించారు. త‌ను ఇదే పాఠ‌శాలలో చ‌దువుకున్న కాబ‌ట్టే లింగంప‌ల్లి పాఠ‌శాల నుంచే నోట్ పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. క‌ష్ట‌ప‌డి చ‌దివితే రానున్న‌ జీవితంలో ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉంటుంద‌ని తెలిపారు. ఉపాధ్యాయులు మ‌న‌ల్ని శిక్షిస్తున్నారంటే మంచి చ‌దువు రావడానికి మాత్ర‌మేనన్నారు. ఈ సంద‌ర్బంగా సందయ్య మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ర‌వి కుమార్ యాద్ మాట్లాడుతూ. గ‌త 20 సంవ‌త్సరాల నుంచి ఎం. సంద‌య్య మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ ద్వారా శేరిలింగంప‌ల్లిలోని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ఉచితంగా పుస్త‌కాలు పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. లింగంప‌ల్లి పాఠ‌శాల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని పాఠ‌శాల‌ల్లో ఉచితంగా నోటు పుస్త‌కాలు పంపిణీ చేస్తామ‌న్నారు. 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఈ సారి కూడా ఉచితంగా స్ట‌డీ మెటిరీయ‌ల్ అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. పిల్లలు తమ విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్త్వం అలవరచుకొని నాయకత్వ లక్షణాలను పెంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమయిన సమాజం నిర్మించటం లో నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా పాలుపంచుకోవాల‌న్నారు. స్కూల్ లో కరెంట్ బిల్ పెండింగ్ లో ఉన్నదని ఉపాధ్యాయులు తెలియజేయగా అన్ని పాటశాలల్లో ఉచితంగా కరెంట్ ఇచ్చేలా మేము తప్పకుండా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, లింగంప‌ల్లి పాఠ‌శాల‌ అభివృద్ధి కొరకు మారబోయిన సదానంద యాదవ్ 1,00,000 రూపాయిలు విరాళంగా ప్రకటించగా అందరూ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, వెంకటరెడ్డి పటేల్, సోమయ్య యాదవ్ , నరసింహ యాదవ్, విజయ్ కుమార్ , నవతా రెడ్డి, కంచర్ల ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, నాగుల్ గౌడ్, రమేష్, ఆంజనేయులు సాగర్, పద్మ, అరుణ, విజయలక్ష్మి, రేణుక, పార్వతి , నాగులు , నరసింహ, ఆకుల లక్ష్మణ్ , రమేష్, గణేష్ ముదిరాజ్, శ్రీనివాస్, జే. శ్రీను, మల్లేష్, వినయ్ , కిట్టు, రవి, అశోక్, కృష్ణ , రామకృష్ణ , రాజేష్, తదితరులు పాల్గొన్నారు.