bandi sanjay eatala rajender reddy
bandi sanjay eatala rajender reddy

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యాయి. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీలో బండి సంజయ్ వర్సస్ ఈటల రాజేందర్ గా నేతల మధ్య విభజన కనిపిస్తోంది. పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజేందర్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులపై లీకులివ్వటం ఏంటని నిలదీస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో అర్దం కావటం లేదంటూ వాపోతున్నారు.బండి సంజయ్ ను పార్టీ అధ్యక్షుడి స్థానం నుంచి మార్చుతున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో డీకే అరుణ..ఈటల రాజేందర్ కు కీలక పదవులు అప్పగించబోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే పార్టీలోని కొందరు ముఖ్య నేతలు ప్రత్యేకంటా భేటీ అయ్యారు. పార్టీలో పరిస్థితుల పైన చర్చించారు.