ఓ వైపు కొడుకు .. మరో వైపు కూతురు . ఇద్దరి మధ్య కొనసాగుతున్న పొలిటికల్ వార్ .. తల్లిగా తనకు ఇద్దరూ సమానమే .. కానీ రాజకీయంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వాలి .. అది తన కాలేదు.. కొడుకు వైపు వెళ్ళలేకా .. కూతురికీ మద్దతివ్వలేక చివరికి అమెరికా వెళ్ళిపోయింది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , షర్మిల తల్లి విజయమ్మ. అమెరికాలో ఉంటున్న మనవడు రాజారెడ్డి వద్దకు ఆమె వెళ్లినట్టు సమాచారం . ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఆమె తిరిగిరారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కొడుకు వై ఎస్ జగన్, కూతురు షర్మిల పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జగన్ పై షర్మిల తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. షర్మిల తీరుపై జగన్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొడుకు, కూతురు ఇద్దరి మధ్య ఆమె నలిగిపోతున్నారు. కొడుకు ,కూతురు మధ్య జరుగుతున్న రాజకీయ పోరులో ఎటువైపు ఉండాలో తెలియక విజయమ్మ మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది . తల్లిగా ఆమెకు ఆ ఇద్దరి పై చెప్పలేనంత ప్రేమ ఉన్నా రాజకీయంగా ఏ ఒక్కరినీ సపోర్ట్ చేయలేని పరిస్థితి . జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, షర్మిల చేస్తున్న బస్సు యాత్రను ప్రారంభించి తల్లిగా ఆమె ఇద్దరినీ ఆశీర్వదించారు. ఇప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరికో ప్రత్యేకంగా మద్దతును తెలుపని పరిస్థితిలో ఏం చేయాలో అర్థంకాక విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. రాజకీయాలు కుటుంబాలను సహితం దూరం చేస్తాయనటానికి నిదర్శమే ఇది కొందరంటున్నారు.