PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తాPJ NEWS official logo
బ్రేకింగ్ న్యూస్
మాదాపూర్ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్ని ప్రమాదం.. కూలింగ్ టవర్ దగ్ధం!ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ డాక్టర్.. పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి రూ.10.05 లక్షల టోకరా!గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు హర్షణీయం: బొబ్బ నవత రెడ్డిపురుగుల బియ్యం.. కుళ్లిన కూరగాయలు.. తెలుగు వర్సిటీలో విద్యార్థుల ధర్నా!పత్తి చేనులో గంజాయి సాగు.. నిర్మల్‌లో రైతు అరెస్ట్!ఆగని రైలు.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. విజయ్ సేతుపతి ‘ట్రైన్’ ట్రైలర్!10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనంపారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి.. కార్పొరేటర్లతో సమన్వయం తప్పనిసరిరుషికొండ భవనాలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. 120 రోజులు ప్రజల సందర్శనకు అనుమతి
తెలంగాణ

కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రెండు పిటిషన్లు డిస్మిస్!

షేర్ చేయండి:
కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రెండు పిటిషన్లు డిస్మిస్!
కూకట్‌పల్లి ట్రక్‌పార్క్ భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్.. రెండు పిటిషన్లు డిస్మిస్!
PJNews | కూకట్‌పల్లి: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసిన కూకట్‌పల్లి హుడా ట్రక్‌పార్క్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూస…

PJNews | కూకట్‌పల్లి: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసిన కూకట్‌పల్లి హుడా ట్రక్‌పార్క్ భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మూసాపేట పరిధిలోని భూముల ఈ-వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను శుక్రవారం కొట్టివేసింది. దీంతో హెచ్‌ఎండీఏ వేలం నిర్వహణకు న్యాయపరమైన మార్గం సుగమమైంది.

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్ కోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. న్యాయస్థానం జోక్యం చేసుకునేంత ప్రజాప్రయోజనం ఈ వ్యాజ్యాల్లో నిరూపితం కాలేదని పేర్కొంటూ శుక్రవారం పిటిషన్లను కొట్టివేసింది.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

ప్రజాప్రయోజనాలకే వినియోగించాలని డిమాండ్

ట్రక్కుల పార్కింగ్ కోసం గతంలో సేకరించిన భూములను వాణిజ్య అవసరాలకు విక్రయించడం సరికాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ట్రక్‌పార్క్ కోసం సేకరించిన భూములను అదే అవసరానికి లేదా ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగించాలని కోరారు.

ప్రభుత్వం వాదన ఇదీ..

ట్రక్ టెర్మినల్ ఏర్పాటు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి న్యాయస్థానానికి వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం నివాస సముదాయాలతో విస్తరించిందని తెలిపారు. నగరం వెలుపల మంగళపల్లి, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో ట్రక్కుల పార్కింగ్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

వేలం ఫలితాలపై ఉత్కంఠ

మూసాపేట రెవెన్యూ గ్రామ పరిధిలో జాతీయ రహదారి–65కు ఆనుకుని ఉన్న ఈ భూముల వేలానికి అక్టోబర్ 24న హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ-వేలం నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేసింది.

భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్ నేతలు, స్థానిక సంఘాలు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

వేలంలో ఎకరాకు ఎంత ధర పలుకుతుంది? ఏ సంస్థ భూములను దక్కించుకుంటుంది? ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరుతుంది? అన్న అంశాలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. వేలం తుది ఫలితాలను హెచ్‌ఎండీఏ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి