PJNEWSPOWER OF JOURNALISM
తెలంగాణ

దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట

షేర్ చేయండి:
దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట
దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట
PJNews | హైదరాబాద్: పోలీస్ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి కృత్రిమ…

PJNews | హైదరాబాద్: పోలీస్ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలి కృత్రిమ మేధ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్టను తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సాంకేతిక ఏర్పాట్లను బుధవారం డీజీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులతో నేరుగా మాట్లాడిన ఉన్నతాధికారులు ఏఐ వ్యవస్థ ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది పనితీరు, ఫిర్యాదుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు.

మాట్లాడితే చాలు.. ఫిర్యాదు సిద్ధం

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు ఏఐ యంత్రం ఎదుట తమ సమస్యను వివరిస్తే, ఆ వివరాల ఆధారంగా ఫిర్యాదు పత్రం సిద్ధమవుతుంది. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేరుతుంది. దాదాపు పది భాషల్లో ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేక కియోస్క్‌ను ఏర్పాటు చేశారు.

ఫిర్యాదుల స్వీకరణతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు, కేసు డైరీలు, దర్యాప్తు నివేదికలు, చార్జిషీట్ల తయారీలో సాంకేతికతను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

త్వరలో అధికారిక ప్రారంభం

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ విధానం ఫలితాలను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలోని ఇతర పోలీస్ స్టేషన్లకు విస్తరించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడంతో పాటు సిబ్బందిపై పనిభారాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

అయితే బాధితుల వ్యక్తిగత సమాచారం భద్రత, ఏఐ రూపొందించే ఫిర్యాదుల్లో పొరపాట్ల సవరణ, అధికారుల పర్యవేక్షణకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

తనిఖీలో అదనపు డీజీపీ అకూన్ సబర్వాల్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ మురళీకృష్ణ, పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టును త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి