PJNEWSPOWER OF JOURNALISM
ప్రజా చౌరస్తాPJ NEWS official logo
బ్రేకింగ్ న్యూస్
మాదాపూర్ రహేజా మైండ్‌స్పేస్‌లో అగ్ని ప్రమాదం.. కూలింగ్ టవర్ దగ్ధం!ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ డాక్టర్.. పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి రూ.10.05 లక్షల టోకరా!గోద్రెజ్ నిర్మాణ బ్లాస్టింగ్‌తో బెంబేలెత్తుతున్న కేపీహెచ్‌బీ వాసులు!మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు హర్షణీయం: బొబ్బ నవత రెడ్డిపురుగుల బియ్యం.. కుళ్లిన కూరగాయలు.. తెలుగు వర్సిటీలో విద్యార్థుల ధర్నా!పత్తి చేనులో గంజాయి సాగు.. నిర్మల్‌లో రైతు అరెస్ట్!ఆగని రైలు.. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.. విజయ్ సేతుపతి ‘ట్రైన్’ ట్రైలర్!10 రోజుల్లో గుంటుపల్లి చోరీ కేసు ఛేదన.. రూ.92 లక్షల బంగారం స్వాధీనంపారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి.. కార్పొరేటర్లతో సమన్వయం తప్పనిసరిరుషికొండ భవనాలపై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం.. 120 రోజులు ప్రజల సందర్శనకు అనుమతి
తెలంగాణ

సైబరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. వారంలో కాంట్రా ఫ్లో బస్సులు!

షేర్ చేయండి:
సైబరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. వారంలో కాంట్రా ఫ్లో బస్సులు!
సైబరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. వారంలో కాంట్రా ఫ్లో బస్సులు!
PJNews | సైబరాబాద్: ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా వారం రోజుల్లో కాంట్రా ఫ్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) …

PJNews | సైబరాబాద్: ఐటీ కారిడార్‌లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా వారం రోజుల్లో కాంట్రా ఫ్లో బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (బీఆర్టీఎస్) అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ వెల్లడించారు. రాయదుర్గంలోని టీ-హబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘సైబరాబాద్ మూవ్స్–2026’ రెండో రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం వరకు..

జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గం వరకు కాంట్రా ఫ్లో బీఆర్టీఎస్ బస్సులను నడిపేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. రద్దీ సమయాల్లో బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రయాణించేలా ఈ విధానాన్ని తీసుకురానున్నారు. కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్లకు అనుసంధానం మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి
సైబరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. వారంలో కాంట్రా ఫ్లో బస్సులు!

సైబరాబాద్‌కు మరో 510 బస్సులు

రానున్న రెండేళ్లలో సైబరాబాద్ పరిధిలో అదనంగా 510 బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో 450 ఏసీ బస్సులు, 60 మినీ బస్సులు ఉన్నాయి. ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడపాలని ప్రతిపాదించింది. వివిధ ప్రజా రవాణా వ్యవస్థల అనుసంధానం కోసం ఎంఎంటీఎస్ సమాచారాన్ని ఓపెన్ డేటా తెలంగాణతో పంచుకోనున్నట్లు ఐటీ శాఖకు చెందిన రవికిరణ్ వెల్లడించారు.

ప్రజా రవాణాపై దృక్పథం మారాలి

సొంత కార్ల వినియోగంపై ఉన్న ఆసక్తి ప్రజా రవాణాపైనా పెరిగేలా మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన సూచించారు. విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కార్‌పూలింగ్, సురక్షిత డ్రైవింగ్, ప్రజా రవాణా వినియోగంపై చర్చించారు. విద్యార్థులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

డబ్ల్యూఆర్‌ఐ ఇండియా సీఈవో మాధవ్ పాయ్ మాట్లాడుతూ రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ట్రాఫిక్, వాయు కాలుష్యం వల్ల చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని వైద్య నిపుణులు వివరించారు. పాఠశాలల పరిసరాల్లో రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు ప్రజా రవాణాకు అనుసంధాన సదుపాయాలు పెంచాలని సూచించారు.

సైబరాబాద్‌లో ట్రాఫిక్‌కు చెక్.. వారంలో కాంట్రా ఫ్లో బస్సులు!

నవంబర్ 26 నుంచి 28 వరకు జరుగుతున్న ఈ సదస్సులో ప్రభుత్వ శాఖలు, పోలీసులు, రవాణా రంగ నిపుణులు పాల్గొంటున్నారు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి