PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

రూ.45 వేల చోరీపై పోలీసులకు ఫిర్యాదు.. మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్!

రూ.45 వేల చోరీపై పోలీసులకు ఫిర్యాదు.. మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్!
రూ.45 వేల చోరీపై పోలీసులకు ఫిర్యాదు.. మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్!
షేర్ చేయండి: WhatsApp X Facebook Telegram
చేవెళ్ల: సెల్‌ఫోన్ చోరీ, బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను హత్య చేసిన కేసును చేవెళ్ల పోలీసులు 24 గంటల్ల…

చేవెళ్ల: సెల్‌ఫోన్ చోరీ, బ్యాంకు ఖాతా నుంచి నగదు బదిలీ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను హత్య చేసిన కేసును చేవెళ్ల పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, చోరీకి గురైన సెల్‌ఫోన్‌తో పాటు హత్యకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా వెలుగోడు ప్రాంతానికి చెందిన కేతావత్ శివశంకర్ వరప్రసాద్ నాయక్ అలియాస్ శివ ఈ కేసులో నిందితుడు. నవంబర్ 20న బత్తుల గురువులు అనే వ్యక్తికి చెందిన సెల్‌ఫోన్‌ను శివ చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ఫోన్ ద్వారా గురువులు బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలను మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించారు.

ఖాతాలో డబ్బులు తగ్గిన విషయం తెలుసుకున్న గురువులు, పద్మతో కలిసి చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో శివపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి

తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో శివ పద్మపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున చేవెళ్లలోని ఫరా కాలేజీ ఎదురుగా ఉన్న రేకుల ఇంటి సమీపంలో పద్మపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు ఆరోపించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శివను గుర్తించి 24 గంటల్లో అరెస్ట్ చేసినట్లు చేవెళ్ల ఇన్‌స్పెక్టర్ కె. నరేందర్ రెడ్డి వెల్లడించారు.

నిందితుడి నుంచి చోరీ చేసిన సెల్‌ఫోన్, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శివపై ఆంధ్రప్రదేశ్‌లోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో రెండు చోరీ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

కేసును త్వరగా ఛేదించిన ఎస్సై వెంకటేష్‌తో పాటు పోలీసు బృందాన్ని ఇన్‌స్పెక్టర్ అభినందించారు. హత్యకు సంబంధించిన ఇతర వివరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి