PJNEWSPOWER OF JOURNALISM
క్రైమ్

వడ్డీ వసూళ్లలో ఖాకీల జోక్యం?.. చందానగర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

షేర్ చేయండి:
వడ్డీ వసూళ్లలో ఖాకీల జోక్యం?.. చందానగర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
వడ్డీ వసూళ్లలో ఖాకీల జోక్యం?.. చందానగర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
PJNews | శేరిలింగంపల్లి: రూ.5.10 లక్షలు అప్పుగా తీసుకుని రూ.6 లక్షలకు పైగా చెల్లించినా వేధింపులు ఆగలేదని, చివరకు పోలీసుల నుంచి కూడా బెదిరింపులు ఎదురయ్యాయన…

PJNews | శేరిలింగంపల్లి: రూ.5.10 లక్షలు అప్పుగా తీసుకుని రూ.6 లక్షలకు పైగా చెల్లించినా వేధింపులు ఆగలేదని, చివరకు పోలీసుల నుంచి కూడా బెదిరింపులు ఎదురయ్యాయని ఓ కారు డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మహేందర్ (31) గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం పీఆర్‌కే ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అప్పు వసూలు వ్యవహారంలో పోలీసుల జోక్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

అసలుకు మించి చెల్లించినా..

కిరాయి కారు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహేందర్ 2025లో స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద విడతలవారీగా రూ.5.10 లక్షలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నెలకు నూటికి రూ.10 వడ్డీ చొప్పున ఇప్పటివరకు రూ.6 లక్షలకు పైగా చెల్లించాడని చెబుతున్నారు. ఓ నెల వడ్డీ చెల్లింపులో ఆలస్యం కావడంతో ఇంటికొచ్చి గొడవ చేశారని ఆరోపిస్తున్నారు.

PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

బ్రేకింగ్ న్యూస్, ముఖ్యమైన వార్తలను నేరుగా పొందండి.

ఇప్పుడే చేరండి
వడ్డీ వసూళ్లలో ఖాకీల జోక్యం?.. చందానగర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

బెయిల్‌పై వచ్చినా తప్పని వేధింపులు?

వడ్డీ వ్యాపారి అల్లుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారని, ఆ పలుకుబడితోనే మహేందర్‌పై ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గతంలో నమోదైన అత్యాచారయత్నం, హత్యాయత్నం కేసుల్లో మహేందర్ సుమారు 45 రోజులు జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడని తెలిపారు. అప్పు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ పోలీసులు తిరిగి ఒత్తిడి చేయడం మొదలుపెట్టారని వాపోయారు.

భార్య, తల్లిపైనా కేసులు పెడతామని బెదిరించారా?

గురువారం ఉదయం ఇంటికి వచ్చిన చందానగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ ఆధార్ కార్డుతో స్టేషన్‌కు రావాలని మహేందర్‌ను ఆదేశించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకపోతే భార్యను, తల్లిని స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత మహేందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆసుపత్రికి తరలించారు.

వడ్డీ వసూళ్లలో ఖాకీల జోక్యం?.. చందానగర్‌లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఇప్పుడూ సెటిల్‌మెంట్‌కు ఒత్తిళ్లు?

మహేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఓ మధ్యవర్తి ద్వారా సెటిల్‌మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ మహేందర్ హెడ్ కానిస్టేబుల్ బెదిరింపుల గురించి చెప్పినట్లు పేర్కొన్నారు.

అప్పు వసూలు వ్యవహారంలో పోలీసుల పాత్ర ఏమిటి? మహేందర్‌ను స్టేషన్‌కు పిలవడానికి కారణమేంటి? కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని నిజంగానే బెదిరించారా? ఈ ప్రశ్నలకు పోలీసు ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వాల్సి ఉంది. వడ్డీ లావాదేవీలు, గతంలో నమోదైన కేసులు, హెడ్ కానిస్టేబుల్ వ్యవహారశైలిపై నిష్పక్షపాత విచారణ జరపాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఈ ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారులు, వడ్డీ వ్యాపారి స్పందన తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం PJ NEWS WhatsApp ఛానల్‌లో చేరండి

తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ మీ వాట్సాప్‌లో పొందండి.

WhatsApp ఛానల్‌లో చేరండి