టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌రోసారి వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓట‌మి భ‌యంతోనే టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ దాడులకు పాల్ప‌డుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గిద్ద‌లూరులో మున‌య్య‌, నంద్యాల‌లో ఇమామ్ హత్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. కుర్చీ దిగిపోయే ముందు వైసీపీ హింసా రాజ‌కీయాలు చేస్తోందని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ముగ్గురు ఎస్‌పీల అండ‌తోనే వైసీపీ గూండాలు చెల‌రేగుతున్నార‌ని ఆరోపించారు. ఎస్‌పీలు ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి, రఘువీర్ రెడ్డి, ర‌విశంక‌ర్‌రెడ్డి వైసీపీకి అనుకూలంగా ప‌ని చేస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. రాష్ట్రంలో రాజ‌కీయ హింస‌, శాంతిభ‌ద్ర‌త‌లపై ఎన్నిక‌ల సంఘం (ఈసీ) త‌క్ష‌ణ‌మే దృష్టి పెట్టాల‌ని చంద్ర‌బాబు సూచించారు.