ఇటీవల టీడీపీ నుంచి నిష్క్రమించి, వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు భిక్షతో ఎదిగావు… ఒరే కుక్కా నువ్వు ఎవరివి? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. “నీ సోదరుడు కేశినేని చిన్ని ఉన్నాడు… అతను నీ తమ్ముడు కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ నాకు అలాంటి పరిధులు ఏమీ లేవు. ఎందుకంటే… చంద్రబాబునాయుడు గారికి నేను రామభక్త హనుమాన్ లాంటివాడ్ని. రెండు నెలల్లో ఎలక్షన్లు ఉన్నాయని నువ్వు వెళ్లిపోయావు… ఇవాళ ఇక్కడేమీ అధికార యంత్రాంగం లేదు… క్లోజయిపోయింది. మూడున్నరేళ్ల కిందటే పిచ్చికుక్క కొడాలి నాని గాడి అంతుచూసినవాడ్ని నేను. నువ్వెంతరా నాకు… నువ్వు నాకు బచ్చావి!