ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నేడు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, విపక్షనేతగా ఉన్న జగన్ ఏమని అన్నారో, వారి ప్రసంగాల తాలూకు క్లిప్పింగ్స్ ను అందరికీ వినిపించారు. హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇవ్వాలని చంద్రబాబు పేర్కొనగా, 25కి 25 ఎంపీలను గెలిపిస్తే హోదా ఎలా ఇవ్వరో చూస్తామని జగన్ ఆవేశంగా ప్రసంగించడం ఆ క్లిప్పింగ్స్ లో ఉంది. 

అనంతరం షర్మిల తన ప్రసంగం కొనసాగించారు. “రాష్ట్ర విభజన తర్వాత మొదట ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అయినా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న అయినా… ప్రత్యేకహోదాపై మీరిచ్చిన మాట తప్పితే ఏపీ ప్రజలకు ద్రోహం చేసినట్టా, కాదా? దీనికి మీరిద్దరూ సమాధానం చెప్పాలి.