శేరిలింగంపల్లి శేరిలింగంపల్లి పవర్ ఆఫ్ జర్నలిజం న్యూస్ ; విద్యార్థులంతా ఇష్టపడి చదువుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని శేరిలింగంపల్లి యువనేత, రఘునాథ్ ఫౌండేషన్ చెర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా లింగంపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ మాట్లాడుతూ. విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటల స్ఫూర్తిగా ఉన్నత ఆలోచనలతో జీవిత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని చెప్పారు. ఇష్టపడి చదవాలని సూచించారు. దేశ భవిష్యత్తు అంతా విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. విద్య అనేది స్వలాభం కోసం కాకుండా దేశ నిర్మాణానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఆర్థిక కారణాలతో ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్న చదువులకు రఘునాథ్ ఫౌండేషన్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్, ఇంచార్జ్ మహేందర్, ఉపాధ్యాయ బృందం, స్థానిక నాయకులు ఘఫూర్, రాములు గౌడ్, అక్బర్, సలీం, భారత్ యాదవ్, పవన్, రాజలింగం, ముక్రమ్, జావేద్, నారాయణ, రషీద్, అలీ, రఫీక్, సతీష్, శ్రీకాంత్, వెంకట్, భాస్కర్, చరణ్ మరియు రఘునాథ్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.