ఇటీవల ‘త్రినయని’ సీరియల్ నటి పవిత్ర జయరామ్ కారు యాక్సిడెంట్‌లో మరణించిన ఆ ఘటన మరవకముందే సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు . పవిత్ర జయరామ్ , చంద్రకాంత్ గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. కాగా మణికొండలో తన ఇంట్లో చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించటంతో టీవీ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి . పవిత్ర జయరామ్ మరణాన్ని తట్టుకోలేక చంద్రకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి . చంద్రకాంత్ పవిత్ర మరణించిన రోజు నుంచి తన బాధను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉన్నాడు. ఆమెతో ఉన్న జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. చివరిగా తను లేని జీవితం వ్యర్థం అని ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలిపోయాడు. . దాదాపు అయిదు రోజుల క్రితం కారు యాక్సిడెంట్ లో సీరియల్ నటి పవిత్ర జయరామ్ చనిపోవడం బుల్లితెరపై కలకలం సృష్టించింది. తనకు క్లోజ్ అయిన బుల్లితెర నటీనటులు అంతా పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయారు. చందూ కూడా పవిత్ర మరణాన్ని నమ్మలేకపోయాడు. కారు యాక్సిడెంట్ సమయంలో పవిత్రతో పాటు చంద్రకాంత్ కూడా కారులోనే ఉన్నాడు. కానీ తనకు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అసలు వారి కారుకు యాక్సిడెంట్ ఎలా జరిగింది, పవిత్ర ఎలా మరణించింది లాంటి వివరాలను చందు బయటపెట్టాడు. అంతా బాగానే ఉన్నట్టు అనిపించినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు పవిత్ర లేదని బాధతో పోస్టులు పెడుతూనే ఉన్నాడు. మూడు రోజుల క్రితం చంద్రకాంత్ పుట్టినరోజు ఉండటంతో తన బర్త్‌డే కోసం పవిత్ర జయరామ్ ఎడిట్ చేసిన ఒక పాత వీడియోను తన సోషల్ మీడియాలో చంద్రకాంత్ షేర్ చేస్తూ ఆ వీడియోకు క్యాప్షన్‌గా ‘‘నాన్న నా కోసం రెండు రోజులు ఆగు’’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అప్పుడు ఆ క్యాప్షన్‌ను ఎవరూ అంతగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ దీన్నిబట్టి చూస్తే పవిత్ర లేని జీవితం తనకు వద్దని జయరామ్ ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ఇక పవిత్ర జయరామ్‌కు మాత్రమే కాదు.. చంద్రకాంత్‌కు కూడా ముందే పెళ్ళయ్యి భార్య శిల్పతో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చంద్రకాంత్, పవిత్రకు బాయ్‌ఫ్రెండ్ మాత్రమే అని కొందరు అంటే.. మరికొందరు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకోవటానికి సిద్ధం అవుతున్న సమయంలోనే ఈ విషాద సంఘటన జరిగిందంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి జీవితాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోవడం బాధాకరంగా ఉందని బుల్లితెర నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.