శేరిలింగంపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన (నూతన విగ్రహం)సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి మహనీయుని విగ్రహానికి పూలమాల సమర్పించి ఆయనను కొనియాడడం జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునాథ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… పోరాటాలలో బహుజనులు కావాలి, అధికారం మాత్రం అగ్రకులకు ఇస్తారా…అంటూ బిజెపి, బీఆర్ఎస్ నేతల పార్టీల తీరుపై ఆయన ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు మోసపోదాం.. ఇప్పటికైనా రండి తిరుగుబాటు చేద్దామంటూ పిలుపునిచ్చారు. స్వతంత్రం కంటే పూర్వమే బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన కులాలను ఐక్యం చేసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన విధంగా ఆయన స్ఫూర్తి తీసుకొని అధికారం కోసం… కాంగ్రెస్ ను అధికారం లోకి తేవడానికి పోరాటం చేస్తుందని, దోపిడి మోసపూరిత పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్ పార్టీల తీరును మోసాన్ని ఎండగట్టడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు, మెజార్టీ ప్రజలుగా ఉన్న బడుగు బలహీన వర్గాల వారికీ తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు, తక్కువ శాతం ఉన్న అగ్రకులాలకు ఎక్కువ శాతం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇవ్వడం మోసం కాదా అని నిలదీశారు. నాలుగు నుండి ఐదు శాతం లేని అగ్రకులాలకు టిఆర్ఎస్, బిజెపి పార్టీల పేరుతో కులమత రాజకీయాలు చేస్తూ కుటుంబ పాలనను కొనసాగిస్తూ బలహీన వర్గాలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అనిచివేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలయల మీద… ఆంగ్లేయుల మీద…ఏ విధంగా తిరుగుబాటు చేశాడో,బిజెపి,టిఆర్ఎస్ పార్టీలపై తిరుగుబాటుకు సిద్ధం కావాలన్నారు.ఈ కార్యక్రమం పలువురు గౌడ సంఘం నేతలు, కాంగ్రెస్ నేతలు, యువత తదితరులు పాల్గొన్నారు.